
Hyderabad, July 19: కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) లో ముగ్గురు విద్యార్థులు(Students) మృతి చెందారు. స్కోడా కారులో వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి (VNR Students) కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అతివేగంగా కారు(Car)ను నడుపుతూ లారీని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.