Thummala VS Ponguleti (PIC @ Twitter)

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు సమర్పించారు. తుమ్మల ఏక వాక్యంలో రాజీనామా లేఖను ముగించారు. ‘ఇన్నాళ్లూ మీరు సహకరించినందుకు ధన్యవాదాలు, మీరు పార్టీకి నా రాజీనామాను ఆమోదించగలరంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మా నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయం అయ్యింది.  శనివారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందు తుమ్మల కండువా కప్పుకునే అవకాశం ఉంది. అయితే  మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల నాగేశ్వరరావుతో సహా జిట్ట బాలకృష్ణ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది.