IPE Exams 2020. Representational Image. | Photo: PTI

Hyderabad, NOV 02: ఎంసెట్‌ (EAMCET) ఎగ్జామ్ రాయ‌నివారికి, క్వాలిఫై కానివారికి గుడ్ న్యూస్. స్పాట్‌ అడ్మి‌షన్స్‌ (Spot Admissions) ద్వారా ఇంజి‌నీ‌రింగ్ లో చేరే అపూర్వ అవ‌కాశం కల్పించారు. ఎంసె‌ట్‌లో (EAMCET) క్వాలిఫై అయి‌న‌వారు కౌన్సె‌లింగ్‌ ద్వారా ప్రవే‌శాలు పొందగా, మిగి‌లిన సీట్లను ఎంసెట్‌ క్వాలిఫై కాని‌వా‌రికి కేటా‌యి‌స్తారు. వీరికి రీయింబ‌ర్స్‌‌మెంట్‌ వర్తించదు. ఫీజు చెల్లించే స్థోమత ఉంటే బుధ, గురు‌వా‌రాల్లో ఎంసెట్‌ స్పాట్‌ అడ్మి‌షన్స్‌ ద్వారా సీటును పొంద‌వచ్చు. ఇంజి‌నీ‌రింగ్‌ కౌన్సె‌లింగ్‌ ముగి‌య‌డంతో ఈ నెల 3 వరకు స్పాట్‌ అడ్మి‌ష‌న్లకు అవ‌కాశం కల్పించారు. ఈ ఏడాది బీటె‌క్‌లో 63, 899 సీట్లు కౌన్సె‌లింగ్‌లో (Counselling) నిండాయి. సీట్లు పొందిన వారిలో ఇప్ప‌టి‌వ‌రకు 57,500 మంది విద్యా‌ర్థులు మాత్రమే నిర్దే‌శిత ఫీజు చెల్లించి, ఆయా కాలే‌జీల్లో రిపో‌ర్ట్‌‌ చే‌శారు. దీంతో 6,399 వరకు సీట్లు మిగి‌లి ‌పోగా, కౌన్సె‌లిం‌గ్‌లో భర్తీ ‌కా‌నివి మరో 19,421 సీట్లు ఉ‌న్నాయి. మొత్తం 25 వేల సీట్లను స్పాట్‌ అడ్మి‌షన్స్‌ (Spot Admissions) ద్వారా భర్తీ చేస్తారు.

Telangana: వైరల్ వీడియో, మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను తన కారులో ఆస్పత్రికి పంపించిన తెలంగాణ మంత్రి 

ఖాళీ సీట్లను తొలుత ఎంసె‌ట్‌లో క్వాలిఫై అయ్యి.. ఇంటర్‌ పాస్‌ అయిన వారితో భర్తీ‌ చే‌స్తారు. ఆ తర్వాత మిగులు సీట్లను ఎంసెట్‌ రాయని వారితో భర్తీ చేస్తారు. ఒరి‌జి‌నల్‌ సర్టి‌ఫి‌కెట్లు ఉన్న వారికి మాత్రమే స్పాట్‌ అడ్మి‌ష‌న్లకు అవ‌కాశం కల్పి‌స్తారు. అయితే సర్టి‌ఫి‌కెట్లను పరి‌శీ‌లించి తిరిగి ఇచ్చే‌స్తారు. ఒక్క ఒరి‌జి‌నల్‌ టీసీతో పాటు జిరాక్స్‌ పత్రా‌లను మాత్రమే తీసు‌కుంటారు. ఇతర రాష్ట్రా‌లకు చెందిన వారు అన‌ర్హులు. అడ్మి‌షన్లు పొందిన తర్వాత ఎంసెట్‌ కన్వీనర్‌ ధ్రువీ‌క‌రి‌స్తేనే అడ్మి‌షన్లు పొంది‌నట్టు లెక్క.

Munugode Bypoll 2022: ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం, ఈ నెల 3న పోలింగ్, నవంబర్ 6న ఫలితం, మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 

జేఎ‌న్టీయూ పరి‌ధి‌లోని కాలే‌జీల్లో ఇంజి‌నీ‌రింగ్‌ మొదటి సంవ‌త్సరం తర‌గ‌తులు గురు‌వారం నుంచి ప్రారం‌భం‌ కా‌ను‌న్నాయి. ఓయూ పరిధిలోని కాలే‌జీల్లో తర‌గ‌తు‌లను బుధ‌వారం నుంచే నిర్వహి‌స్తారు. ఈ సంద‌ర్భంగా విద్యా‌ర్థు‌లకు ఇండ‌క్షన్‌ ప్రోగ్రాంలు నిర్వ‌హించి అధి‌కా‌రులు ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల ప్రాధా‌న్యాన్ని వివ‌రిం‌చ‌ను‌న్నారు.