Hyderabad, May 28: తెలంగాణలో ఓటర్ల జాబితా (Telangana Voter List) సవరణకు ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే (Home to Home Survey) నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను (Polling Centres) పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు. ఆ తరువాత ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దీనిపై ఆగస్టు 31 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను సెప్టెంబర్ 22లోపు పరిష్కరించి అక్టోబర్ 10న తుది జాబితా విడుదల చేస్తారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. అక్టోబర్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారు https://t.co/PgvFDeirm1 ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. pic.twitter.com/viB3h3wmFy
— AIR News Hyderabad (@airnews_hyd) May 28, 2023
ఓటు హక్కు కోసం దరఖాస్తు
అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.