Hyderabad, SEP 10: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (heavy rains) నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు సూచనలున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert) జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.