Representational (Credits: TSRTC)

Hyderabad, AUG 13: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్లతో పాటు హైదరాబాద్‌ సిటీలోని (Hyderabad) సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీని ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్‌ సిటీజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీని ఇస్తున్నట్లు (Special Offer) వెల్లడించింది. హైదరాబాద్‌ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు టీ-24 టికెట్‌ను రూ.50కే జారీ చేయనున్నది. ఈ నెల 15న స్వతంత్ర దినోత్సవం ఒక రోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టీ-24 టికెట్‌ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్‌ సిటీజన్లకు రూ.100 ఉన్నది.

12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 టికెట్‌ ధర ఉండగా.. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టీ-24 టికెట్‌ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనున్నది. పిల్లలకు రూ.50కి జారీ చేయనున్నది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటీజన్లకు ఒక రోజు టికెటలో 50శాతం రాయితీని కల్పిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు.