Hyderabad, DEC 10: టీఎస్ ఆర్టీసీ సంస్థ (TSRTC) అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త వినిపించింది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని (Ayyappa dashan) దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయించి నష్టపోకుండా, రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారికి, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామన్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణం ఉచితంగా ఇస్తామన్నారు.
ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించవలసిన పుణ్యక్షేత్రాల వరకు నడుపబడును. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావలసిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్‌ల కొరకు www.tsrtconline.in సంప్రదించాలని సూచించారు. సలహాలకు, సూచనలకు, ఫిర్యాదుల కొరకు TSRTC కాల్ సెంటర్ 040 23450033, 69440000 సంప్రదించగలరు.