TSPSC notifies 1,392 junior lecturer posts

Hyderabad, DEC 10: రాష్ట్ర పోలీసు శాఖ‌లో కొత్త పోస్టుల భ‌ర్తీకి (police recruitment) తెలంగాణ మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను (Police department) మరింత పటిష్టం చేయాలని కేబినెట్ (Cabinet meeting) నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ కేబినెట్‌ చర్చించింది.

Cyclone Mandous: దటీజ్ భూమన కరుణాకర్ రెడ్డి, భారీ వరదల్లో, మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలను పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే, వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది.

Cyclone Mandous: షాకింగ్ వీడియో, తిరుపతిలో పారిశుధ్య కార్మికురాలిపై పడిన భారీ చెట్టు, తృటిలో తప్పించుకున్న మహిళ, స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు 

వీటితోపాటు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.