బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరుమలలో గత రెండు రోజులుగా మాండోస్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మహా వృక్షం నేలకొరిగింది. తిరుమలలోని బాలాజీ బస్టాండ్ కు ఆనుకొని ఉన్న ఏఎన్సి కాటేజెస్ వద్ద ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. అదే దారిలో వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిపై చెట్టు అతివేగంగా పడింది.

దీని గుర్తించిన పారిశుధ్య కార్మికురాలు తప్పించుకొనే ప్రయత్నం చేసింది. అయినా ఆమెపై చెట్టు పడిపోవడంతో స్వల్ప గాయాల పాలైంది. హుటాహుటిన అక్కడకు చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది పారిశుధ్య కార్మికురాలిని అశ్విని ఆసుపత్రికి తరలించారు.

Here;s Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)