TSRTC Reduced Charges: తెలంగాణలో తగ్గిన ఆర్టీసీ ఛార్జీలు, గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం, ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్న యాజమాన్యం
Image used for representational purpose. TSRTC Buses. | Photo - Wikimedia Commons

Hyderabad, Feb 10: టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణీకుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్లస్ ఛార్జీలు (Garuda Plus charges) త‌గ్గించింది. ప్రయాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఈ నిర్ణయం తీసుకున్నది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్పష్టం చేసింది. స‌వ‌రించిన‌, త‌గ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ (Telangana) సరిహద్దు దాటిన తరువాత అంతకు ముందున్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ – బెంగళూరు (Hyderabad-Bangalore) మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఎండీ స‌జ్జనార్ స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ నిర్ణయంతో హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ.54 తగ్గినట్లు ఆయన వివరించారు.

TSRTC Bus Fare Hike: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు, ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర పెరిగే అవకాశం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన టీఎస్‌ఆర్టీసీ అధికారులు

తెలంగాణ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది యాజమాన్యం. ఇప్పటికే వివిద స్కీమ్ లను ప్రవేశపెట్టింది. 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే బస్సును పంపిస్తామని తెలిపింది. ఇక మేడారం, సంక్రాంతి వంటి ప్రత్యేక సమయాల్లో అదనపు చార్జీలను వసూలు చేయడం లేదు. దీంతో ఆదాయం క్రమంగా పెరుగుతోంది.