TSRTC Image used for representational purpose only |Photo Wikimedia Commons

Hyderabad Feb 05: మేడారం (Medaram) భక్తుల కోసం టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 3,845 ఆర్టీసీ బస్సు (RTC Buses) సర్వీసులను తిప్పుతుంది. రాష్ట్రంలోని 51 పాయంట్స్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు(Bus servies) ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు 30 మంది ఉంటే ప్రత్యేక బస్సును నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. 523 బస్సులను 1,250 ట్రిప్పులను ఇప్పటివరకు ఆర్టీసీ నడిపినట్లు తెలిపారు. ప్రైవేట్ వాహనాలను గద్దెలకు చాలా దూరంలోనే నిలిపివేస్తుండగా...ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే, చాలా దగ్గరికి తీసుకెళ్లనున్నారు. అంతేకాదు అమ్మవార్ల దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని సజ్జనార్ తెలిపారు.

మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంప్, తాత్కాలిక బస్టాండ్ (Temporary Bus stand) ఏర్పాట్లు చేశారు. 7,400 మీటర్ల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి మేడారం జాతర(Medaram jathara) కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. మేడారం విత్ టీఎస్ఆర్టీసీ పేరుతో యాప్ ను లాంచ్ చేశారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచారు.

వరంగల్ నుంచి 2 వేల బస్సుల్లో కండక్టర్లు లేకుండా సర్వీసులు నడిపిస్తున్నట్లు సజ్జనార్‌ తెలిపారు. మేడారంలో ఉచిత షటల్ సర్వీసులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మేడారం జాతరను ఆదాయం తెచ్చిపేట్టే జాతరగా కాకుండా ఒక సామాజిక సేవ, సామాజిక బాధ్యతగా ఆర్టీసీ భావించి, భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు.

మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీవరకు జరగుతుంది. మేడారం జాతర సందర్భంగా గతేడాది 19,09,838 మందిని వివిధ గమ్యస్ధానాలకు చేర్చామని సజ్జనార్ వివరించారు. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 523 బస్సులను 1,250 ట్రిప్పులను మేడారానికి నడిపినట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి పెరిగే భక్తల రద్దీని తట్టుకునేందుకు బస్సులు సిద్ధం చేశామని చెప్పారు.