Hyderabad December 25:  బీజేపీ నేత, జర్నలిస్ట్ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్(Teenmar Mallanna) మల్లన్నపై దాడి జరిగింది. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్టుకు(Mallanna twitter post) కోపంతో ఊగిపోయిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తీన్మార్ మల్లన్నపై దాడికి దిగారు. ఈ ఘటన బోడుప్పల్‌(Boduppal) పరిధిలోని లక్ష్మీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు.. బోడుప్పల్‌లోని శనార్థి తెలంగాణ పత్రికా కార్యాలయం(Shanarthi Telangana)లో ఉన్న తీన్మార్‌ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి(Attack on teenmar mallanna) చేశారని రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి వెల్లడించారు.

అయితే అభివృద్ది ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా.. హిమాన్షు శరీరంలోనా అనే అర్థం వచ్చేలాగా ట్విటర్‌లో పోస్టు పెట్టారు తీన్మార్ మల్లన్న. ఈ పోస్టు గురించే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దుండగుల దాడిలో శనార్థి తెలంగాణ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్స్, టీవీలు, ఫర్నిచర్‌ని సైతం ధ్వంసమైంది. దుండగుల దాడికి సంబంధించిన వీడియోను (Teenmar Mallanna attack visuals) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీడియాకు విడుదల చేసిన తీన్మార్ మల్లన్న.. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గూండాల పనే అని ఆరోపించారు.