వనమా రాఘవరావు (Image: Youtube)

భద్రాచలం, జనవరి 8: పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు వనమా రాఘవను భద్రాచలం సబ్‌ జైలుకు తరలించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఎ-2 నిందితుడిగా ఉన్నారు. శుక్రవారం వనమా రాఘవను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. ఈరోజు మేజిస్ట్రేట్‌ ముందు హాజరపరిచారు. ఈ ఘటనలో వనమా రాఘవతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు రాఘవను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ.

వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వనమా రాఘవను నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. అటు తర్వాత వనమా రాఘవను అరెస్ట్‌ చేశారు పోలీసులు. దమ్మపేట వద్ద రాఘవను అరెస్ట్‌ చేసిన విషయాన్ని పోలీసులు తెలిపారు.