Hyderabad, FEB 10: సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై (vande bharat) మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ – గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నంబర్ కోచ్‌లో అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం (Secundrabad-vishakapatnam) వెళ్తున్న ఈ సమయంలో దాడి జరిగింది (attacked with stones). కోచ్ అద్దాలు పగులగా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వేపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఇంతకు ముందు ఈ నెల 3న ఖమ్మం జిల్లాలోనూ వందేభారత్ రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను గుర్తించామని, వారికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు జనవరిలో రైలు ప్రారంభానికి ముందే దాడి జరిగిన విషయం విధితమే. ట్రయిల్ రన్‌లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు.