Dead (Credits: X)

Hyderabad, May 08: హైదరాబాద్‌ నగరంలోని బాచుపల్లిలో (Bachupally) విషాదం చోటుచేసుకుంది. రేణుకా ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. నిన్న సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి తడిసి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం ప్రహరి గోడ (Wall Collapsed) కూలిపోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌  

కూలిన గోడ శిథిలాల కింద (Wall Collapsed) నుంచి మొత్తం ఏడు మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు తిరుపతి (20), శంకర్‌ (22), రాజు (25), ఖుషి (23), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.