Hyderabad, June 22: ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులపై మొదటి సారిగా 336 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం మొదలు పెట్టారు. ఈ కేసుల్లో మూడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడవచ్చు.
ఉల్లంఘదారులను గుర్తించేందుకు..
ఉల్లంఘదారులను గుర్తించేందుకు నగరంలో 124 ప్రాంతాల్లో ఏఎన్‌పీఆర్ కెమెరాలు అమర్చినట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే కమిషనరేట్ పరిధిలో రాంగ్ రూట్ వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు.