టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 చివరి వెర్షన్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇప్పుడు పిక్సెల్ 3 కంటే ముందు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు అందుబాటులో తెచ్చేందుకు సిద్ధం చేస్తోంది. The Verge న్యూస్ ప్రకారం Android 12 ప్రస్తుతం Pixel 3, Pixel 3a, Pixel 4, Pixel 4a, Pixel 4a 5G, Pixel 5 , Pixel 5aలలో ఇన్‌స్టాల్ చేయడానికి అందుబాటులో ఉంది. ఇది పిక్సెల్ 6 , పిక్సెల్ 6 ప్రోలో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ 12 ఈ ఏడాది చివర్లో Samsung Galaxy, OnePlus, Oppo, Realme, Tecno, Vivo , Xiaomi పరికరాలలో అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది.
ఆండ్రాయిడ్ 12లో అత్యంత గుర్తించదగిన ఫీచర్ కొత్త 'మెటీరియల్ యు' డిజైన్ ఇది యూత్ ను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇది మీకు నచ్చిన విధంగా హోమ్ స్క్రీన్ రూపాన్ని మార్చుకోవడానికి వినియోగదారులను కొంచెం లోతుగా వెళ్లేలా చేస్తుంది. యాప్ ఐకాన్‌లు, పుల్-డౌన్ మెనులు, విడ్జెట్‌లు మొదలైన వాటికి రంగులను సమన్వయం చేయడానికి వినియోగదారుల కోసం ఇది మునుపటి ఆండ్రాయిడ్ వెర్షన్ కంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉందని నివేదిక పేర్కొంది.
భవిష్యత్తులో Android 12తో Pixel ఫోన్‌లు మరిన్ని "Pixel-first" ఫీచర్‌లను పొందే అవకాశం ఉంది. అప్‌డేట్ పొందడానికి, మీ పిక్సెల్ ఫోన్ సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లి, "సిస్టమ్" క్లిక్ చేసి, ఆపై "సిస్టమ్ అప్‌డేట్"ని కనుగొని, క్లిక్ చేయండి. AI కార్యాచరణను మెరుగుపరచడానికి టెక్ దిగ్గజం మంగళవారం కూడా టెన్సర్ చిప్‌సెట్‌తో పిక్సెల్ 6 , పిక్సెల్ 6 ప్రోలను ప్రారంభించింది.