మొబైల్ బ్రాండ్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో అస్యూస్ (Asus) ఒకటి. ఈ కంపెనీ నుంచి 'ROG Phone2' అనే స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనాలో విడుదలయింది, సెప్టెంబర్ 4, 2019 నుంచి ఇండియా సహా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ ను విడతల వారీగా విడుదల చేయనున్నట్లు అస్యూస్ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన స్మార్ట్ ఫోన్ లతో పోల్చిచూస్తే ఈ స్మార్ట్ ఫోన్ 'అంతకుమించి' అని చెప్పవచ్చు. పూర్తిగా హైహైఎండ్ ఫీచర్లతో వస్తున్నది. ఈ ఫోన్ లోని స్క్రీన్ కానీ, బ్యాటరీగానీ, ర్యామ్ మరియు కెమెరాలు అత్యుత్తమైనవిగా ఉన్నాయి.
దీనికి 120Hz AMOLED డిస్ ప్లే ఇస్తున్నారు. ఇంతటి హైడెఫినేషన్ తో ఫోన్ స్క్రీన్ ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్. 6.59 ఇంచుల ఫోన్ స్క్రీన్, దానికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ఫిక్స్ చేసి అందిస్తున్నారు. డ్యుఎల్ స్క్రీన్ గా కూడా వాడుకోవచ్చు. 12 జీబి ర్యామ్ మరియు 512 జీబీ UFS 3.0 స్టోరేజ్ సామర్థ్యం. UFS 3.0 స్టోరేజ్ ఇంతవరకు ఏ స్మార్ట్ ఫోన్ లో ఇవ్వలేదు. శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 855 P ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో ఎలాంటి గేమ్ అయినా ఆడుకునేందుకు వీలుగా గేమ్ ప్యాడ్ మరియు ఫోన్ వేడికాకుండా ఎయిరోయాక్టివ్ కూలర్ కూడా అదనంగా అందిస్తున్నారు.
ఇక ROG Phone2 ఆడియో ఫీచర్లు చూస్తే అత్యాధునిక 'ఎయిర్ ట్రిగ్గర్స్ మరియు స్టీరియో స్పీకర్స్ . 3.5ఎంఎం ఆడియో జాక్ ఇచ్చారు. అలాగే వెనకవైపు 48 మెగా పిక్సెల్ సోనీ కెమెరా, 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు ముందువైపు 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
బ్యాటరీ కూడా ఇంతవరకు ఏ ఫోన్ లో లేని విధంగా 6000mAh బ్యాటరీ 4.0 క్విక్ ఛార్జింగ్ ఫీచర్ కలిగి ఉంది.
ఇక ROG Phone2 స్మార్ట్‌ఫోన్ విశిష్టతలు క్లుప్తంగా...
6.59 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్, 1080 x 2340 పిక్సెల్స్ రెసల్యూషన్.
48+13 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 24 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
6000mAh బ్యాటరీ సామర్థ్యం
ర్యామ్ 12 GB స్టోరేజ్ మరియు ర్యామ్ 512GB స్టోరేజ్
అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్.
దీని ధర రూ. 1.30 లక్షలు ఉండొచ్చని అంచనా.