Mumbai, SEP 18: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అక్టోబర్‌ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు (Bank Holidays) మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే ఛాన్స్‌ ఉంటుంది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్‌తేరాస్‌, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు (Bank Holidays in October) రానున్నాయి.

Jio Network Down? జియో నెట్‌వర్క్‌ డౌన్, గంట వ్యవధిలోనే 10 వేల ఫిర్యాదులు, కంపెనీ నుంచి ఇంకా రాని ప్రకటన 

పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాల్గో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో ఓ లుక్కేద్దాం రండి..!

సెలవులు జాబితా

అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాకులకు సెలవు.

అక్టోబర్‌ 3న నవరాత్రి వేడుకలు ప్రారంభం. మహారాజా అగ్రసేన్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 6న ఆదివారం బ్యాంకుల మూసివేత.

అక్టోబర్ 10 మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.

అక్టోబర్‌ 11న మహానవమి సందర్భంగా మూసివేత.

అక్టోబర్‌ 12న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.

అక్టోబర్‌ 13న ఆదివారం కావడంతో సెలవు.

అక్టోబర్‌ 17న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.

అక్టోబర్‌ 20న ఆదివారం సెలవు.

అక్టోబర్ 26న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.

అక్టోబర్‌ 27న ఆదివారం సెలవు.

అక్టోబర్ 31న దీపావళి, సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ సందర్భంగా సెలవు.