Telegram messaging app (PIC @ Wikimedia Commons)

Brasilia, April 27: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు (suspends Telegram) బ్రెజిల్‌ కోర్టులో షాక్ తగిలింది. టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేదిస్తున్నట్లు (suspends Telegram) కోర్టు ప్రకటించింది. బ్రెజిల్‌ లో నియో నాజిలకు సంబంధించి టెలిగ్రామ్‌ వేదికగా జరుగుతున్న ఆపరేషన్స్ గురించి సమాచారం ఇవ్వడంలో విఫలమయినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో నియో నాజిల యాక్టివిటీకి (neo-Nazi activity) సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా బ్రెజిల్‌ కోర్టు టెలిగ్రామ్‌పై సీరియస్ అయింది.

అంతేకాదు మెసేజింగ్ యాప్‌నకు రోజుకు మిలియన్ నాజీలు(రూ. 16 కోట్లు) జరిమానా విధించింది. టెలిగ్రామ్‌పై (Telegram messaging app) తాత్కాలిక నిషేదం విధించింది. యాంటి సెమిటిక్‌ ఫ్రంట్‌, యాంటీ సెమిటిక్ మూమెంట్ లు టెలిగ్రామ్ వేదికగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు బ్రెజిల్ ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది చిన్నారుల భవిష్యత్తును నాశనం చేసే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అందుకే టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది. అయితే నియో నాజి గ్రూప్ యాక్టివిటీలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తే ఈ నిషేదం తొలగిపోయే అవకాశముంది.