Google Chrome (Photo Credits: Pixabay)

New Delhi, AUG 10: క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్‌లో చాలా లోపాలు ఉన్నాయని.. వాటిని వాడుకొని హ్యాకర్లు సిస్టమ్స్‌ను రిమోట్‌లోకి తీసుకొని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది. సిస్టమ్‌లో స్టోర్‌ చేసి పెట్టుకొని కీలకమైన డేటాను కాపీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.

Instagram Update: ఇన్ స్టాగ్రామ్ యూజ‌ర్ల‌కు బిగ్ అప్ డేట్, ఇకపై ఒకేసారి 20 ఫోటోలు అప్ లోడ్ చేయ‌వ‌చ్చు 

సిస్టమ్‌ను రిమోట్‌గా షట్‌డౌన్‌ చేయవచ్చని.. గూగుల్ క్రోమ్‌ బ్రౌజర్‌లో సేవ చేసుకున్న అన్ని పాస్‌వర్డ్‌లను సైతం తస్కరించేందుకు ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అంతటితో ఆగకుండా మాల్వేర్‌ను నెట్‌వర్క్‌తో పాటు కంప్యూటర్‌లో చొప్పించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. విండోస్‌, మ్యాక్‌ యూజర్లు తప్పనిసరిగా గూగుల్‌ క్రోమ్‌ 127.0.6533.88/89కి అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. క్రోమ్‌ బ్రౌజర్‌ను ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ మోడ్‌లో ఉంచాలని.. తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని చెప్పింది.