Top Washing Machines: ఎలాంటి వాషింగ్ మిషిన్ బాగా పనిచేస్తుంది. మార్కెట్లో ఏ బ్రాండ్ కు విలువ ఉంది? ఇండియాలో టాప్ 5 వాషింగ్ మిషిన్ బ్రాండ్స్ పై రివ్యూస్ చూడండి.
Representational image| Credits: Pexels

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఖాళీ సమయం దొరకడమనేది చాలా తక్కువ. ఆ కాస్త సమయంలో కూడా ఇంటిపనుల కోసం కేటాయిస్తే శరీరానికి విశ్రాంతి లేకుండా పోతుంది. దీంతో చాలా మంది ఇంటి పనులను 'స్మార్ట్'గా పూర్తి చేసేసుకుంటున్నారు. బట్టలు ఉతకడం కోసం వాషింగ్ మిషీన్ ల వైపు దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్లో ఇప్పుడు ఎన్నోరకాల బ్రాండ్ల వాషింగ్ మిషీన్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది బాగా పనిచేస్తుంది, ఏది తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది, అవసరాలకు బట్టి ఎంత కెపాసిటీ ఉన్నది కొనుక్కోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఇండియాలో 2019 ఏయే బ్రాండ్లు మంచి ప్రాచుర్యాన్ని పొందాయో తెలుసుకోండి.

IFB TL-RDSS 6.5 KG Aqua

టాప్ లోడ్ వాషింగ్ మిషీన్లలో భారతీయ కంపెనీ అయిన IFB బ్రాండ్ అంతర్జాతీయ బ్రాండ్ లకు గట్టి పోటీనిస్తుంది. ఈ బ్రాండ్ అనతికాలంలోనే ప్రముఖ బ్రాండ్ గా ఎదిగింది. IFB బ్రాండ్ వాషింగ్ మిషిన్ లలో ఉండే ఆక్వా టెక్నాలజీ నీరు ఎంత కఠినంగా ఉన్నా బట్టలలోని మురికిని తీసేస్తుంది. అలాగే కొన్నిసార్లు పరిమితికి మించి బట్టల లోడ్ వేసినా ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అందుకు తగినట్లుగానే నీటిని, డిటర్జెంట్ ను తీసుకుంటూ ఇవి పనిచేస్తాయి. నీటి ప్రెషర్ తక్కువున్నా లేదా మధ్యలో పవర్ పోయి

వచ్చినా ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు, ఆగిన దగ్గరి నుంచే మళ్లీ వాషింగ్ కొనసాగుతుంది.

మైనస్ - అయితే ఇవి టాప్ లోడ్ వాషింగ్ మిషిన్లు కాబట్టి నీటి వినియోగం ఎక్కువగా జరుగుతుంది. అలాగే బట్టలు పూర్తిగా ఆరిపోవు, ఉతికడం పూర్తయిన తర్వాత బట్టలను వేరేగా ఆరబెట్టాల్సిన అవసరం ఉంటుంది.

Samsung WW65M206L0W/TL Front Load, Automatic

సామ్ సంగ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో ప్రముఖంగా వినిపించే బ్రాండ్. అలాగే వాషింగ్ మిషిన్ లలో కూడా సామ్ సంగ్ సంస్థ అగ్రగామిగా ఉంది. మీరు వాషింగ్ మిషన్లలో మంచి టెక్నాలజీ, దీర్ఘకాలికంగా పనిచేసేది కావాలనుకుంటే Samsung WW65M206L0W/TL ఎంచుకోవచ్చు. ఇందులో ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది కరెంట్ ఆదా చేయడమే కాకుండా, ఉపయోగించేటపుడు శబ్దం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఎలాంటి రకం బట్టలనైనా జాగ్రత్తగా ఉతికేందుకు ప్రోగ్రాం చేయబడింది, ఇందులో హీటర్ కూడా ఇచ్చారు కాబట్టి వేడి నీళ్లలో ఉతకాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇది నీటిని, విద్యుత్ ను చాలా తక్కువ వినియోగించుకుంటుంది.

మైనస్- ఈ వాషింగ్ మిషన్ అధునాతన టెక్నాలజీని కలిగి ఉంది కాబట్టి ఎప్పుడైనా దీనిని రిపేర్ చేయించాలంటే ఎక్స్ పర్ట్స్ అవసరం ఉంటుంది. నీటి ప్రెషర్ తక్కువ ఉన్నా లేదా నీరు కఠినంగా ఉంటే ఉతికేటపుడు అంతరాయం ఏర్పడుతుంది.

Bosch WAB16060IN

ప్రముఖ జర్మన్ ఎలక్ట్రానిక్ సంస్థ అయిన బోష్ నుండి Bosch WAB16060IN ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషిన్ పూర్తిగా ఆటోమేటిక్ టెక్నాలజీతో పనిచేస్తుంది. బోష్ బ్రాండ్ నుంచి వచ్చే ఏదైనా ఎలక్ట్రానిక్ బ్రాండ్ చాలా ఖరీదైనదై ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఈ వాషింగ్ మిషిన్ ఆటోమేటిక్ టెక్నాలజీతో నడిచే సెగ్మెంట్లోనే అతి తక్కువ ధరలోనే లభ్యమవుతుంది. అంతేకాదు ఇది తక్కువ విద్యుత్ వినియోగంతో చాలా తక్కువ వ్యవధిలోనే బట్టలను ఉతికేస్తుంది. దీనిలోని 'యాక్టివ్ వాటర్ సెన్సార్' బట్టలకు ఎంతైతే నీరు, డిటర్జెంట్ అవసరమో అంతమాత్రమే వినియోగించుకుంటుంది.

మైనస్ - దీని స్పిన్ వేగం తక్కువ ఉంది కాబట్టి ఇందులో బట్టలు ఆరబెడితే నెమ్మదిగా నీరు బయటికి వెళ్లటంతో పాటు, విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది.

Whirlpool Whitemagic Premier 6.5 kg

ఈ బ్రాండ్ వాషింగ్ మిషిన్లు ఇండియాలో చాలా కాలం నుంచే వినియోగంలో ఉన్నాయి. ఈ వాషింగ్ మిషిన్లు చాలా ఆకర్శణీయమైన రంగుల్లో, అందరికీ అందుబాటులో బడ్జెట్ ధరలలోనే లభిస్తాయి. వీటి పనితీరు కూడా మిగతా వాటితో పోల్చితే పూర్తిగా భిన్నం.

ఇందులో ఉండే స్క్రబ్, స్పా టెక్నాలజీ బట్టలపై కఠినమైన మురికిని సైతం పోగొడతాయి. నీరు కఠినంగా ఉన్నా, ప్రెషర్ తక్కువగా ఉన్నా ఉతకడంలో ఎలాంటి అంతరాయం ఏర్పడదు.

మైనస్- ఈ వాషింగ్ మిషిన్లు కఠినమైన మరకలను ఎలా అయితే పోగొడుతుందో అది బట్టల మన్నికపై కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది.

LG P9037R3SM 8 kg

ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఇండియాలో LGకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వాషింగ్ మిషిన్ చాలా సులభమైన, ఎలాంటి సంక్లిష్ట టెక్నాలజీలు లేని వాషింగ్ మిషిన్. ఎలాంటి బట్టలకైనా ఒకేరకంగా ఉతకగలిగే 3 విధానాలు ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి. వీటితోచాలా శుభ్రంగా ఉతికేస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే 'విండ్ జెట్ డ్రై' టెక్నాలజీ ఉతికిన బట్టలను చాలా తక్కువ సమయంలోనే ఆరబెట్టగలదు. అలాగే ఎలుకల బారి నుండి మిషన్ రక్షింపబడేలా ఇందులో ప్రత్యేకవ్యవస్థ ఉంది. దీనిని ఏ మూలకైనా పెట్టడం చాలా సులభం.

మైనస్- ఇది బేసిక్ వాషింగ్ మిషీన్, పూర్తిగా ప్లాస్టిక్ బాడీతోనే తయారు చేయబడింది.