Dangerous Virus in Xiaomi, Redmi, Poco Devices: ఈ చైనా బ్రాండ్ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీ ఫోన్ రిస్క్ లో ఉన్న‌ట్లే, రెడ్ మీ, షావోమీ, పోకో ఫోన్ల‌లో అత్యంత డెంజ‌ర‌స్ వైర‌స్ గుర్తించిన నిపుణులు
Mobile (Photo-pexels)

Mumbai, May 08: షావోమీ ఫోన్‌లతో పాటు ఈ కంపెనీకి చెందిన రెడ్‌మీ (Redmi), పోకో స్మార్ట్‌ఫోన్‌లలో (Poco) ప్రమాదకర వైరస్‌ను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వైరస్‌ (Dangerous Virus) వల్ల వినియోగదారుల వ్యక్తిగత డాటా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఫోన్‌లలో ఏప్రిల్‌ 25 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య దాదాపు 20 భద్రతాపరమైన లోపాలు, సమస్యలను సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ వివరాలను ఓవర్‌సెక్యూర్డ్‌ అనే బ్లాగ్‌లో ప్రచురించారు.

 Paytm Layoffs: పేటీఎం నుంచి ఇద్దరు సీబీఓలు అవుట్, కొనసాగుతున్న పునర్నిర్మాణం కంపెనీ నుంచి వైదొలిగిన అజయ్ విక్రమ్ సింగ్, బిపిన్ కౌల్ 

ఎంఐయూఐ, హైపర్‌ఓఎస్‌ (Hyper OS) వినియోగించే ఫోన్‌లలో ఈ సమస్యలు ఉన్నట్టు పేర్కొన్నారు. షావోమీ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌ యాప్‌(AOSP)లలో లోపాలు ఉన్నాయని, వీటిని వెంటనే సరిచేయాలని తెలిపారు. ఈ భద్రతాపరమైన లోపాల గురించి చైనాకు చెందిన షావోమీ (Xiaomi) సంస్థ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.