New Delhi, OCT 24: జియోహాట్‌స్టార్ (Jiohotstar.com) ఎవరి సొంతమో తెలుసా? రిలయన్స్ కంపెనీ? స్టార్ ఇండియా? రెండూ కాదు.. ఈ డొమైన్ నేమ్ ఒక యాప్ డెవలపర్ ముందుగానే కొనుగోలు చేశాడు. కేంబ్రిడ్జ్‌కి వెళ్లేందుకు అవసరమైన డబ్బులను జియో తనకు చెల్లిస్తుందని భావిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఒక యాప్ డెవలపర్‌కు కేంబ్రిడ్జ్‌లో చదవాలనేది పెద్ద కల. యాప్ డెవలపర్ తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెలివిగా ఆలోచించాడు. 2023 ప్రారంభంలో సోషల్ మీడియాలో ఒక విషయం అతడి దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయిన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది. డిస్నీ పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ను భారతీయ పోటీదారు రిలయన్స్ జియోలో విలీనం చేయాలని చూస్తోంది. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత కలను నెరవేర్చుకోవాలని భావించాడు. ఈ ఏడాది ప్రారంభంలో డిస్నీ+ హాట్‌స్టార్ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 మధ్య విలీనానికి ఆమోదం పొందింది. ఈ విలీనం ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు.
Delhi Developer Squats On Jiohotstar Website
Delhi Developer vs. Reliance: JioHotstar
A Delhi-based app developer has acquired the JioHotstar domain name, surprising many by asking Reliance to sponsor his Cambridge education in exchange for transferring the domain. This unexpected move raises questions about digital rights… pic.twitter.com/bnhBdTIezn
— Kunal Kushwaha (@kunalstwt) October 24, 2024
అయితే, ఢిల్లీకి చెందిన యాప్ డెవలపర్ ముందుగానే ఆలోచించి రిలయన్స్ ఇదే డొమైన్ పేరుతో కొనుగోలు చేసే అవకాశం ఉందని ఊహించాడు. ఉదాహరణకు.. Saavn.com రిలయన్స్ కొనుగోలు చేసి JioSaavn.com డొమైన్‌గా మార్చింది. హాట్‌స్టార్‌తో విలీనం తర్వాత కూడా అదే చేస్తారని అతడు అనుకున్నాడు. ఆ ఆలోచనలో భాగంగానే JioHotstar.com డొమైన్ కోసం చెక్ చేశాడు. డొమైన్ అందుబాటులో ఉండటంతో వెంటనే కొనేసుకున్నాడు. ఒకవేళ రిలయన్స్ ఇదే పేరుతో డొమైన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. తాను కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనే తన లక్ష్యానికి నిధులు సమకూర్చగలనని భావించాడు.
ఇప్పుడు, జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్ చేతిలో ఉండటంతో తన ప్లాన్ చాలా సులభమైంది. వయాకామ్18, డిస్నీ+హాట్‌స్టార్ మధ్య విలీనం జరిగితే డొమైన్‌ను రిలయన్స్‌కి విక్రయించాలని భావించాడు. అలా వచ్చే నిధులు చివరకు కేంబ్రిడ్జ్‌లో చదవాలనే కలను నిజం చేస్తాయని ఆశపడ్డాడు. విలీనం నేపథ్యంలో యాప్ డెవలపర్ ఇప్పుడు రిలయన్స్ తన డొమైన్‌ను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తుందని మాత్రమే ఆశిస్తున్నాడు.
తన డొమైన్ కోసం “విలీన సంస్థకు సరిపోయే బ్రాండ్ పేరు”గా పేర్కొన్నాడు. జియో, హాట్‌స్టార్ విలీనమైన తర్వాత ఒకే ఒక సైట్ మాత్రమే ఉంటుందని నివేదికలు ధృవీకరిస్తున్నాయి. (JioCinema లేదా Hotstar.com) విలీన సంస్థకు JioHotstar.com అనేది సరైన బ్రాండ్ పేరుగా ఉంటుందని నేను నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. ఇది రెండు బ్రాండ్‌ల బ్రాండ్ ఈక్విటీని సూచిస్తుంది.
అందిన సమాచారం ప్రకారం.. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ యాప్ డెవలపర్‌ను సంప్రదించగా డొమైన్ విక్రయానికి 93,345 పౌండ్లు (కోటి రూపాయలు) డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే, తన అభ్యర్థన జియో తిరస్కరించినట్టు యాప్ డెవలపర్ చెప్పారు. రిలయన్స్ తన ట్రేడ్‌మార్క్‌ను ఉల్లంఘించినందుకు యాప్ డెవలపర్‌పై చట్టపరమైన చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. యాప్ డెవలపర్ ఇప్పుడు తన అభ్యర్థనను పునఃపరిశీలించమని రిలయన్స్‌ను అభ్యర్థిస్తున్నాడు.