FASTags with incomplete KYC to be deactivated post Jan 31: NHAI

New Delhi, FEB 17: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకును తొలగించింది. ఈ నిర్ణయంతో 2.40కోట్ల మందిపై ప్రభావం పడనున్నది. అయితే, వీరంతా ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్‌ చేసుకొని మరో బ్యాంకుకు మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో ఇండియన్‌ హైవే మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHMCL) ఫాస్టాగ్ వినియోగదారులకు అడ్వైజరీని జారీ చేసింది. 32 అధీకృత బ్యాంకుల నుంచి ‘ఫాస్టాగ్‌’ సేవలను పొందవచ్చని సూచించింది.

ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్‌ (Paytm Fastag) ఉన్న వాహనదారులు దాన్ని సరెండర్‌ చేసి అధీకృత బ్యాంకు నుంచి కొత్తగా ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో 32 అధీకృత బ్యాంకుల జాబితాను ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ విడుదల చేసింది. ఆర్‌బీఐ (RBI) సూచనల మేరకు కొత్త ‘ఫాస్టాగ్‌’ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్లుగా పేర్కొన్నంది. గత నెల 19న రాసిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఫాస్టాగ్‌లను జారీ చేయకుండా చర్యలు తీసుకున్నది.

Gruha Jyothi-Aadhar Link: ఆధార్‌ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్‌ నంబర్‌ కు ఆధార్‌ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం 

ఫాస్టాగ్‌ పేటీఎం (Paytm Fastag) పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ఐడీ, పాస్వర్డ్‌తో వ్యాలెట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. ఆ తర్వాత ఫాస్టాగ్‌ నంబర్‌, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. పేజీని కిందికి స్క్రోల్‌ చేస్తే హెల్ఫ్‌, సపోర్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో నీడ్‌ హెల్ప్‌ విత్‌ నాన్‌ ఆర్డర్స్‌ క్వెరీస్‌పై క్లిక్‌ చేయాలి. అందులో ఫాస్టాగ్‌ ప్రొఫైల్‌ అప్‌డేట్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో ‘ఐ వాంట్‌ క్లోజ్‌ ఫాస్టాగ్‌ అండ్‌ ఫాలో ఫర్‌దర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌’ సెలెక్ట్‌ చేసుకొని.. ఆ తర్వాత వచ్చే సూచనలను ఫాలో అవ్వాలి. పేటీఎం నుంచి ఫాస్టాగ్‌ను పోర్ట్‌ చేసేందుకు బదిలీ చేయాలనుకుంటున్న బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేయాలి.

వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పాటు బ్యాంకు అడిగి సమాచారాన్ని ఇస్తే ఫాస్టాగ్‌ను పోర్ట్‌ చేస్తారు. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఫాస్టాగ్‌ అధికృత బ్యాంకుల జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండియన్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బ్యాంకు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పేటీఎం నోడల్‌ ఖాతాను యాక్సిస్‌ బ్యాంకుకు మార్చింది. పేటీఎం నోడల్‌ అకౌంట్‌ కస్టమర్రలు.. వ్యాపారుల లావాదేవీలు పరిష్కరించే మాస్టర్‌ ఖాతాలాంటిది.