Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

కరోనా నుంచి కోలుకుని 2024లో అడుగుపెట్టిన సాఫ్ట్ వేర్లకు ఈ ఏడాది కంపెనీలు (Layoffs in 2024) భారీగానే షాకింగ్ ఇస్తున్నాయి.ఈ ఏడాది ప్రారంభ నెల జనవరిలో ఇప్పటికి ఏకంగా 24,564 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. లేఆఫ్స్ వివరాలను ప్రకటించే ఎఫ్‌వైఐ రిపోర్ట్ ప్రకారం జనవరి నెలలో సుమారు 91 టెక్ కంపెనీలు 24,564 మందిని తొలగించినట్లు (Tech layoffs 2024) తెలుస్తోంది.టెక్ దిగ్గజం సేల్స్ ఫోర్స్ గత శుక్రవారమే తమ కంపెనీ సిబ్బందిలో 700 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక 2023లో మొత్తం 1187 టెక్ కంపెనీల నుంచి 2,62,595 మంది ఉద్యోగాలను కోల్పోయినట్లు లేఆఫ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi నుంచి వచ్చిన డేటా చెబుతోంది. 2024 ప్రారంభంలోనే ఆన్‌లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ ఏకంగా 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గేమింగ్ కంపెనీ యూనిటీ తమ ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ మానేసి ఆఫీసుకు వస్తారా లేదంటే రాజీనామా చేస్తారా, మేనేజర్లకు వార్నింగ్ ఇచ్చిన టెక్ దిగ్గజం IBM

ఇక టెక్ దిగ్గజం గూగుల్ కూడా హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తీసేస్తున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక మెమోలో తెలిపినట్లు సమాచారం.

అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెజాన్ యొక్క స్ట్రీమింగ్ యూనిట్ ట్విచ్ దాని సిబ్బందిలో 35% లేదా దాదాపు 500 మంది కార్మికులను తగ్గించడానికి సిద్ధంగా ఉంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ కూడా 2024 ఆరంభంలో కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌లను ఇంటికి సాగనంపింది. Pixar Animation Studios ఉద్యోగాలను తగ్గించడానికి సిద్ధంగా ఉంది, ఎందుకంటే స్టూడియో కొన్ని షోలలో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ మంది సిబ్బందిని కలిగి ఉంది. దీంతో కోతలు స్టార్ట్ చేసింది.

రెండవ సారి కోతలను ప్రకటించిన స్విగ్గీ, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫుడ్ డెలివరీ దిగ్గజం

Riot Games 530 మంది ఉద్యోగులను లేదా ప్రపంచవ్యాప్తంగా 11% మంది సిబ్బందిని తొలగించాలని యోచిస్తోందని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సోమవారం ఒక బ్లాగ్‌లో తెలిపింది.సోషల్ చాట్ మరియు మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ తన సిబ్బందిలో 17% మందిని తగ్గించుకుంటామని జనవరి 11న ఉద్యోగులకు తెలిపింది. CEO జాసన్ సిట్రాన్ పంపిన అంతర్గత మెమో ప్రకారం దాదాపు 170 ఉద్యోగాలు తొలగింపుల వల్ల ప్రభావితమవుతాయి.IT కంపెనీ జిరాక్స్ జనవరి 3న తన వర్క్‌ఫోర్స్‌ను 15% తగ్గించనున్నట్లు ప్రకటించింది.

ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ మేజర్ స్విగ్గీ మరో రౌండ్ లేఆఫ్‌లను ప్రారంభించింది.వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ వర్క్‌ఫోర్స్ తగ్గింపు కసరత్తును ప్రారంభించింది.ఫిట్‌నెస్ స్టార్టప్ Cult.fit ఖర్చు తగ్గింపు చర్యలో భాగంగా 100-120 మంది ఉద్యోగులను తొలగించింది. గత నెలలో, Paytm యొక్క మాతృ సంస్థ అయిన One 97 కమ్యూనికేషన్స్ బహుళ యూనిట్లలోని 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది.