Twitter New CEO Linda Yaccarino (PIC@ Twitter)

New Delhi, May 12: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కంపెనీ కొత్త సీఈవో ను ప్రకటించారు. ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యక్కరినో ను ప్రకటించారు ఎలన్ మస్క్ (Elon Musk). ఈ ఉదయమే  ఆరు వారాల వ్యవధిలో ఎట్టకేలకు ట్విట్టర్‌కి కొత్త CEO వస్తారని మస్క్ ధృవీకరించారు.  NBCUniversal లో పనిచేస్తున్న లిండా యక్కరినో (Linda Yaccarino) సీఈఓ రోల్ చేపట్టనున్నట్లు ఇంటర్నెట్‌లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అదే నిజమైంది. లిండా యక్కరినో  (NBCUniversal) తో 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఆమె మీడియా, యాడ్స్‌లలో అనేక బాధ్యతలను చేపట్టారు. ట్విట్టర్ 2006లో ప్రారంభమైనప్పటి నుంచి ఐదుగురు సీఈఓలు మారారు. 44 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన వెంటనే పరాగ్ అగర్వాల్‌ను మస్క్ అక్టోబర్ 22న తొలగించారు.

ట్విట్టర్ కంపెనీ మొదటి సీఈఓ ఇవాన్ విలియమ్స్ కాగా.. ఆయన 2006లో ట్విట్టర్‌ని స్థాపించాడు. 2008లో విలియమ్స్ సీఈఓ పదవి నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో డిక్ కాస్టోలో సీఈఓగా నియమితులయ్యారు. కాస్టోలో కంపెనీకి 5ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. అదే సమయంలో ట్విట్టర్ గణనీయమైన వృద్ధిని సాధించింది. అప్పడే కాస్టోలోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే క్రమంలో డిక్ కాస్టోలో 2015లో తన పదవికి రాజీ నామా చేశాడు. కాస్టోలో స్థానంలో జాక్ డోర్సే సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో 2006 నుంచి 2008 వరకు ట్విట్టర్ సీఈఓగా పనిచేశారు. సీఈఓగా డోర్సే పని విధానాల్లో కొత్త మార్పులు తీసుకురావడం వివాదానికి దారితీసింది. కంపెనీ మోడరేషన్ విధానాలను నిర్వహించడంలో విమర్శలు ఎదురయ్యాయి.

E-Commerce Platforms: నిబంధనలు ఉల్లంఘిస్తూ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ విక్రయం, 5 ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసిన కేంద్రం 

అంతేకాదు.. అనేక కుంభకోణాలలో కూడా అతని ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2022లో, డోర్సే మళ్లీ సీఈఓ పదవి నుంచి వైదొలిగాడు. ఈసారి తన ఇతర కంపెనీ స్క్వేర్‌పై దృష్టి పెట్టాడు. తన రాజీనామాను ప్రకటించిన సమయంలో డోర్సే ట్విట్టర్ వ్యవస్థాపకుల నుంచి ముందుకు సాగడానికి ఇదే సమయమని తెలిపాడు. తన వారసుడిగా పేరుపొందిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈఓగా నియమించాడు. ట్విట్టర్‌ను సమర్థవంతంగా నడపగలడనే నమ్మకం పరాగ్‌పై ఉందని చెప్పాడు.