Lucid (Photo Credits: IANS | Twitter)

San Francisco, March 29: ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను (Layoffs) తొలగిస్తూ వస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్‌ లూసిడ్ (Lucid Layoffs) కూడా చేరింది. త్వరలోనే తమ కంపెనీలో 1300 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు లూసిడ్ తెలిపింది. అంటే సంస్థ ఉద్యోగుల్లో 18 శాతం మందిని ఇంటికి సాగనంపనుంది. రానున్న కొద్దినెలల్లో పర్మామెన్స్ ఆధారంగా ఉద్యోగాల కోత విధించే అవకాశం ఉంది. ఈ మేరకు లూసిడ్ సీఈవో పీటర్ రావ్లిసన్ (Peter Rawlinson) ఒక రెగ్యులేటరీ ఫిల్లింగ్ కు పంపిన ఈ మెయిల్‌లో ధృవీకరించారు.

రెండో త్రైమాసికం ముగిసేలోగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్గనైజేషన్ లోని అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగాల కోత ఉంటుందని తెలిపారు పీటర్. తొలగింపునకు గురైన ఉద్యోగులకు లూసిడ్ (Lucid) హెల్త్ కేర్ కవరేజ్ వర్తిస్తుందని, వారికి నష్టపరిహారం కూడా చెల్లించనున్నట్లు తెలుస్తోంది.