ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు (Meta Fresh Layoffs) రంగం సిద్దం చేసుకుంది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రచురించింది.
బ్లూమ్‌బెర్గ్ తెలిపిన నివేదిక ప్రకారం.. తాజా లేఆఫ్స్‌పై (Meta To Announce Fresh Layoffs) మేనేజర్లుకు మెటా మెమో పంపింది. ఆ మెమోలో ఉద్యోగుల్ని కోత విధించే విషయంలో సిద్ధంగా ఉండాలని సూచించింది. మేనేజర్‌లకు పంపిన మెమోలో ఉద్యోగులు సైతం కొత్త మేనేజర్ల పర్యవేక్షణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, వర్క్‌ను విభజించినప్పుడు వివిధ విభాగాల ఉద్యోగులు వారితో పనిచేయాల్సి వస్తుందని సూచించింది.
నియామకాలు తగ్గినప్పటికీ, 50 శాతం మంది దేశీయ ఉద్యోగులు జాబ్ మారడానికి సిద్ధంగా లేరు
ఈ లేఆఫ్స్ ద్వారా ఫేస్‌బుక్, వాట్సాప్,ఇన్‌స్టా, వర్చువల్ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్,క్విస్ట్ హార్డ్ వంటి విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు10 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లు జుకర్ బర్గ్ ఈ ఏడాది మార్చి నెలలో ప్రకటించిన విషయం తెలిసింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఇప్పుడు తొలగింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.అయితే మెటా ప్రతినిధి లేఆఫ్స్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
5 నెలల్లో మెటా భారీగా ఉద్యోగాలను తొలగించడం ఇది రెండో సారి. గత నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగులపై మెటా వేటు వేసింది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల్ని మరోసారి తొలగిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలియజేసింది. కొత్త నియామకాల్ని నిలిపివేసింది.