New Delhi, May 25: అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే వరుసలో చంద్రడు (Moon), బృహస్పతి(Mars), శుక్రుడు (Venus) కనిపించాయి. ఈ మూడు ఒకే కక్ష్యలోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలోకి (Moon, Mars and Venus Conjunction) రావడం చాలా అరుదైన సందర్భమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఔత్సాహికులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అద్భుతమైన, అరుదైన సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బందించారు.
The Moon, Venus and Mars from evening today pic.twitter.com/5PJF2677rI
— Anas 🌙 (@_anassaeed) May 24, 2023
ఈ అరుదైన దృశ్యాలు చూడటం అదృష్టమంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ దృశ్యాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందంటున్నారు.
over #London at about 10pm this evening. pic.twitter.com/wIIcTZqDR4
— Hugh Sykes (@HughSykes) May 23, 2023
ఈ దృశ్యాలు కేవలం భారత్‌లో మాత్రమే కాదు లండన్ తో పాటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించాయి. వాటికి సంబంధించి వివిధ ప్రదేశాలకు చెందిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
Nightfall with the Moon and Venus (Mars quickly becoming more visible just below the Moon, and Gemini ♊️ (the Twins) also starting to appear above Venus) 🌙 🙏🏼 ⭐️ pic.twitter.com/BMDoIyTnbC
— Thomas (@Collabor8tor) May 25, 2023
ఖగోళ శాస్త్రవేత్తలు సైతం ఈ దృశ్యాలను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. వేర్వేరు దిశల్లో ఉండే మూడు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం చాలా అరుదుగా ఉంటుందంటున్నారు.