EPFO (Credits: X)

New Delhi, June 14: క‌రోనా సమయంలో తీసుకొచ్చిన క‌రోనా అడ్వాన్స్‌ (Covid advance) సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిలిపివేసింది. క‌రోనా వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్‌ఓ (EPFO) ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. క‌రోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్‌ (Corona Advance) సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. క‌రోనా ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా ఈ అడ్వాన్సు సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది. రెండో వేవ్‌ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించారు. అలా దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంది. తొలుత ఒకసారి మాత్రమే అడ్వాన్స్‌ పొందే అవకాశం కల్పించినా.. తర్వాత పలుమార్లు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో భాగంగా మూడు నెలల బేసిక్‌+ డీఏ లేదా ఈపీఎఫ్‌ ఖాతాలో (EPF) ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు.

EPFO New Rules: ఇకపై పీఎఫ్ విత్ డ్రా చేయ‌డం మ‌రింత ఈజీ, అత్య‌వ‌స‌రంగా పీఎఫ్ విత్ డ్రా చేసేందుకు రూల్స్ మార్చిన సంస్థ‌, చెక్, బ్యాక్ పాస్ బుక్ అప్ లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు 

క‌రోనా సమయంలో చాలామందికి ఈ సౌకర్యం ఉపకరించింది. అయితే, ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ను మరికొందరు ఇతర అవసరాలకు కూడా వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అడ్వాన్స్‌ సదుపాయం నిలిచిపోయినప్పటికీ.. ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది.