ప్రముఖ ముబైల్ తయారీదారు నోకియా గతేడాది విడుదల చేసిన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ (Nokia 6.1 Smartphone) ధరలను భారీగా తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 6,999/- లకే లభ్యమవుతోంది. 2018 ఏప్రిల్ నెలలో రెండు వేరియంట్లలో 3GB + 32GB మరియు 4GB + 64GB లలో నోకియా 6.1 ఫోన్ విడుదలైంది. ఆ సమయంలో దీని ధర వేరియంట్ ను బట్టి 16,999 నుంచి మొదలుకొని రూ. 20,095 వరకు ఉండేది. అయితే కొంతకాలం తర్వాత వీటి ధరలను నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో రూ. 8,999 నుంచి 10,999 లుగా సవరించింది. కాగా, ప్రస్తుతం మరింతగా తగ్గించేసింది. ఇందులో 3GB + 32GB వేరియంట్ ధరను 6,999/- మరియు 4GB + 64GB ధరను 9,999 లుగా నిర్ణయించింది. అయితే ఈ భారీ తగ్గింపుల వెనక నోకియా ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ప్రస్తుతం నోకియా ఆన్‌లైన్ స్టోర్లలో (Nokia Online Store) తాజాగా సవరించిన ధరలతో నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నవి. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
3,000mAh బ్యాటరీ సామర్థ్యం గల ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీను ఒకసారి ఛార్జి చేస్తే 16 గంటలు వరకు టాక్ టైం లభిస్తుందని కంపెనీ పేర్కొంది, దీని ఇతర విశిష్టతలు ఇలా ఉన్నాయి.
5.5 ఇంచుల స్క్రీన్, 1080x1920 పిక్సెల్స్ రెసల్యూషన్
16 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 8 మెగా పిక్సెల్ ముందు కెమెరా
ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
3000mAh బ్యాటరీ సామర్థ్యం, వైర్‌లెస్ ఛార్జర్
ర్యామ్ 3GB/4GB, స్టోరేజ్ 32GB/64, 128 జీబీ వరకు విస్తరించుకునే సౌకర్యం.
అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్