రెడ్‌మి కే20, రియల్‌మి ఎక్స్, వివో వీ15 స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా, అలాంటి ఫీచర్లతోనే వాటి కంటే కాస్త తక్కువ ధరకే ఒప్పో మొబైల్స్ సంస్థ 'ఒప్పో కే3'  (Oppo K3) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జూలై 23, 2019 నుంచి ఈ ఫోన్ ప్రత్యేకంగా 'అమెజాన్' (Amazon)లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మెరుగైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ ఫోన్ ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో VOOC 3.0 సపోర్ట్‌తో వేగంగా ఛార్జింగ్ చేసుకునే వీలుంటుంది.

ఒప్పో కే3 స్మార్ట్‌ఫోన్ 'ఆరోరా బ్లూ' (Aurora Blue) మరియు జేడ్ బ్లాక్ (Jade Black)      2రంగుల్లో , 2 వేరియంట్లలో లభ్యమవుతుంది. భారత మార్కెట్లో ఒప్పో కే3 స్మార్ట్‌ఫోన్ 6జీబి ర్యామ్ ధర, రూ 16,999/- కాగా, 8 జీబీ వేరియంట్ ధర రూ 19,990/- గా నిర్ణయించారు. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వినియోగించి ఈ ఫోన్ కొనుగోలు చేసేవారి కోసం రూ. 1000 డిస్కౌంట్‌తో పాటు మరెన్నో అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

ఇక ఒప్పో కే3 స్మార్ట్‌ఫోన్ ఇతర విశిష్టతలు ఇలా ఉన్నాయి...

6.5 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్, 1080 x 2340 పిక్సెల్స్ రెసల్యూషన్.

16+2 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా - పాప్ అప్.

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

3765mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 6GB/64GB స్టోరేజ్ మరియు ర్యామ్ 8GB/128GB స్టోరేజ్ - రెండు వేరియంట్లు

అండ్రాయిడ్ 9.0 పై (Android 9.0 Pie) ఆపరేటింగ్ సిస్టమ్.