PF Account Merge (PIC @ TW)

New Delhi, March 25:  సాధారణంగా ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. ఒక ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీనిపై అవగాహన లేక అలానే వదిలేస్తున్నారు. దీనివల్ల మీరు మానేసిన కంపెనీలోని పీఎఫ్ అకౌంట్ అమౌంట్ అలాగే ఉండిపోతుంది. ఏ కంపెనీలో చేరినా ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ (EPF accounts) కామన్‌గా ఉంటుంది.  అలాగే, ఉద్యోగికి UAN నెంబర్ కూడా ఉంటుంది. ఈ యూనిక్ నెంబర్ ద్వారా పీఎఫ్ అకౌంట్ స్టేటస్ చేసుకునేందుకు వీలుంటుంది. అందుకే, ఉద్యోగం మారినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి తమ (EPF) అకౌంట్ విలీనం చేయడం మర్చిపోకూడదు. మీ పాత UAN నంబర్ నుంచి కొత్త PF అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు పాత పీఎఫ్ అకౌంట్లోని మొత్తాన్ని కొత్త పీఎఫ్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Pinduoduo App: చైనా యాప్‌లో మాల్ వేర్, Pinduoduoని ప్లే స్టోర్ నుండి తీసేసిన చేసిన సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్

మీరు కొత్త కంపెనీలో మీ మునుపటి UAN నంబర్‌ని ఉపయోగించి మాత్రమే కొత్త PF అకౌంట్ ఓపెన్ అవుతుందనే విషయం గుర్తించుకోవాలి. అయితే, కొత్త పీఎఫ్ అకౌంట్లో పాత కంపెనీ టైమ్ ఫండ్ ఉండదు. అందువల్ల PF అకౌంట్‌దారుడు తమ అకౌంట్ విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం (EPFO) ​​వెబ్‌సైట్‌ విజిట్ చేయాలి. అందులో (EPF Account Merge ) చేసుకోవడం ద్వారా మీ పాత పీఎఫ్ మొత్తాన్ని కొత్త అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు. పీఎఫ్ అకౌంట్ విలీనం తర్వాత మీ EPF అకౌంట్లో జమ చేసిన మొత్తాన్ని ఒకే అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ అకౌంట్ ఎలా Merge చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Whatsapp on 4 Device: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్, ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో వాడుకునేలా కొత్త అప్‌డేట్, విండోస్‌కోసం సరికొత్త యాప్‌ రూపొందించిన వాట్సాప్‌

PF అకౌంట్ ఎలా విలీనం చేయాలంటే?

* పీఎఫ్ అకౌంట్లో ఆన్‌లైన్‌లో సులభంగా విలీనం చేయవచ్చు.

* EPFO అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

‘Services’ ఆప్షన్ ఎంచుకోండి

‘One Employee-One EPF Account’పై Click చేయండి

* ట్యాబ్‌లో కొత్త ఫారమ్ కనిపిస్తుంది.

* PF అకౌంట్ ఫోన్ నంబర్, UAN నంబర్, ప్రస్తుత మెంబర్ ఐడీని ఎంటర్ చేయండి.

* ఆ తర్వాత, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

* పోర్టల్‌లో OTPని ఎంటర్ చేయండి. ఇప్పుడు, మీ పాత PF అకౌంట్ కనిపిస్తుంది.

* PF అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆపై డిక్లరేషన్‌ (declaration)ను అంగీకరించండి

* ఆ తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయండి

* Verification తర్వాత.. మీ అకౌంట్ కొన్ని రోజుల తర్వాత Merge అవుతుంది.

TDS on Online Gaming: ఆన్‌లైన్‌ గేములు ఆడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి మీ జేబుకు చిల్లు ఖాయం, ఇకపై గేమ్‌లో గెలిస్తే టీడీఎస్ కట్టాల్సిందే

ఆన్‌లైన్‌లో EPFకి సంబంధించిన ఏదైనా సదుపాయాన్ని పొందాలంటే.. మీరు తప్పనిసరిగా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తెలుసుకోవాలి. UAN యాక్టివేట్‌లో ఉందని నిర్ధారించుకోండి. మీ UANని తెలుసుకోవాలంటే.. మీరు (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)ని విజిట్ చేయాల్సి ఉంటుంది. కుడి వైపున ఉన్న ‘Employee Linked Section’పై క్లిక్ చేయాలి. ఆపై ‘Know your UAN’పై Click చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే Captcha కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ వివరాలను నమోదు చేసిన తర్వాత (Request OTP) చేయండి. మీ PF అకౌంట్ నంబర్, Captcha కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ వంటి అదనపు వివరాలను నమోదు చేయాలి. ‘Show my UAN Number’పై Click చేయండి. మీకు UAN వివరాలను తెలుసుకోవచ్చు.