Jio New Offer: జియో తాజా ఆఫర్, రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి నాలుగు డిస్కౌంట్ కూపన్లు, జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఆఫర్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ( Jio New offfer) ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది.
Mumbai, June 3: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు కొత్త ఆఫర్ ను ( Jio New offfer) ప్రకటించింది. రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే వారికి ఒకే విలువ గల నాలుగు డిస్కౌంట్ కూపన్లను ఇస్తున్నట్టు తెలిపింది. రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ వేర్, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో
రీచార్జి చేసుకున్న తర్వాత ఈ కూపన్లు మైజియో యాప్ లో జమ అవుతాయని... షాపింగ్ చేసేటప్పుడు కూపన్లను రీడీమ్ చేసుకోవచ్చని వెల్లడించింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఇది వరకే రీచార్జ్ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌కు అర్హులని సంస్థ ప్రకటించింది. అయితే అడ్వాన్స్ రీచార్జ్ చేసుకున్న వారు మై జియో యాప్‌లోని మై ప్లాన్స్ సెక్షన్‌లో ఆఫర్‌కు సంబంధించిన వివరాలుంటాయని తెలిపింది. ఈ ఆఫర్ జూన్ 1 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్‌డౌన్ సడలింపు వల్ల తమ ఆఫర్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుందని సంస్థ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Jun 03, 2020 08:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

