Free Jio Wi-Fi calling starts rolling out, works with over 150 phones and all Wi-Fi networks (Photo-PTI)

Mumbai, May 15: రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.  విదేశీ పెట్టుబడుల్లో జియో హ్యాట్రిక్ డీల్, విస్టా ఈక్వెటీ కంపెనీకి 2.3 శాతం వాటాను అమ్మేసిన ముఖేష్ అంబానీ, డీల్ విలువ సుమారు రూ. 11,367 కోట్లు

రిలయన్స్ జియో వినియోగదారులకు ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి అదనపు లాభాలు రూ.999 ప్లాన్ ద్వారా లభించనున్నాయి.ఇతర నెట్ వర్క్ లకు 3,000 నిమిషాలు ఉచితం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ 3 జీబీ అయిపోయాక నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. చందాదారులు కొత్త ప్లాన్‌ను మైజియో యాప్‌ నుండి నేరుగా రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్ లేదా గూగుల్ పే లేదా పేటిఎం లాంటి యాప్స్ ద్వారా కూడా రీచార్జ్‌ చేసుకోవచ్చు.

దీంతోపాటు ప్రస్తుతం జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.599, రూ.555 ప్లాన్లు. ఇవి వరుసగా 2జీబీ, 1.5జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్ల ద్వారా కూడా జియో నుంచి జియోకు ఉచిత అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు చేసుకోవడానికి 3000 ఉచిత నిమిషాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభ్యం. అలాగే జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభించనుంది