Mumbai, May 8: రిలయన్స్ జియో (Reliance Jio) విదేశీ పెట్టుబడులతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాలతో జోరుమీదున్న జియో తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ (Vista Equity Partners) కంపెనీతో మరో మెగా ఒప్పందానికి (Reliance Jio-Vista Deal) సన్నద్ధమైంది. కంపెనీకి ఇది విదేశీ పెట్టుబడుల్లో హ్యాట్రిక్ డీల్ అని చెప్పవచ్చు. రియలన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియోలో 2.3 శాతం వాటా షేర్లను అమెరికాకు చెందిన విస్టా ఈక్వెటీ కంపెనీ కొన్నది. దీని ద్వారా విస్టా కంపెనీ జియోలో సుమారు 11,367 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. జియో మరో భారీ డీల్, రిలయన్స్ జియో ఫ్లాట్‌ఫాంపై సిల్వర్ లేక్ రూ. 5,656 కోట్ల పెట్టుబడులు, డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామం అన్న ముఖేష్ అంబానీ
ఈ డీల్ ద్వారా జియోలో గత కొన్ని రోజుల్లోనే పెట్టుబడులు పెట్టిన మూడవ కంపెనీగా విస్టా నిలిచింది. ఇటీవలే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ 43,534 కోట్లు, సిల్వర్ లేక్ 5656 కోట్లు జియోలో పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచ దేశాలకు చెందిన మేటి టెక్నాలజీ సంస్థల నుంచి కేవలం రెండు వారాల్లోనే జియో ఫ్లాట్‌ఫాం మొత్తం 60,596.37 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత పదేళ్ల నుంచి టెక్నాలజీ కంపెనీల్లో విస్టా పెట్టుబడులు పెడుతున్నది.
Here's the media release:
US Based Vista Equity Partners picks up equity stake in Reliance’s JIO platform pic.twitter.com/gziXlc7BR4
— ANI (@ANI) May 8, 2020
ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్‌కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి. ఈ ఒప్పందంలో ఈక్విటీ విలువ రూ .4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ .5.16 లక్షల కోట్లు అని రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫామ్‌లు శుక్రవారం ప్రకటించాయి. దీంతో విస్టా జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా నిలిచింది. తమ ఇతర భాగస్వాముల మాదిరిగానే, విస్టా కూడా భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా భారతీయులందరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో తమతో జత కట్టిందని ఆర్ఐఎల్ ఛైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
తాజా పెట్టుబడులతో ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ .60,596.37 కోట్లు పెట్టుబడులను మూడు వారాల్లో సేకరించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. దీంతో శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ 3 శాతానికి పైగా ఎగిసింది. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సారథ్యంలోని ఆర్ఐఎల్ మార్చి 2020 నాటికి రూ.1.61 లక్షల కోట్ల అప్పుతో ఉన్న కంపెనీ 2021 నాటికి రుణ రహిత సంస్థగా అవతరించే లక్ష్య సాధనలో సమీప దూరంలో నిలిచింది.