Meta (Photo Credit: Pixabay)

New York, June 11: మెటా ఫౌండర్‌ మార్క్ జూకర్‭బర్గ్‭ (Zuckerberg) మీద ఆ సంస్థలోని 70 శాతం ఉద్యోగులకు నమ్మకం లేదట. ఈ విషయాన్ని ఇంకెవరో చెప్పలేదు. స్వయంగా మెటా నిర్వహించిన ఉద్యోగుల సర్వేలోనే వెల్లడైంది. ఆయన నాయకత్వపై కేవలం 26 శాతం మంది సిబ్బంది మాత్రమే విశ్వాసం కలిగి ఉన్నారని స్వయంగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలోనే తేలిందని వాషింగ్టన్ పోస్ట్‌ పేర్కొంది. తరుచూ ఇలాంటి సర్వేలు నిర్వహిస్తారని, అయితే గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో ఐదు శాతం వ్యతిరేకత పెరిగిందట. అక్టోబర్‌లో 58 శాతం నుంచి 43 శాతం మంది ఉద్యోగులు (Meta Employees) జూకర్‭బర్గ్ మీద విశ్వాసం ఉంచారట. అయితే 21,000 కంటే ఎక్కువ ఉద్యోగుల కోత, ఉన్న ఉద్యోగులకు బడ్జెట్ తగ్గింపు వంటి కారణాల వల్ల జూకర్‭బర్గ్ మీద నైరాశ్యం పెరిగిందట. మెటా ఆర్థిక పనితీరును మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి, కంపెనీలోని తక్కువ ప్రాధాన్యత గల ప్రాజెక్ట్‌లను రద్దు చేస్తున్నారు. అంతే కాకుండా నియామకాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ప్రకటనల వ్యయంలో మెటా పోస్ట్-పాండమిక్ తిరోగమనంతో నడుస్తోందట.

Reddit Layoffs: ఆగని లేఆప్స్, 90 మంది ఉద్యోగులకి ఉద్వాసన పలుకుతున్న రెడ్డిట్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం 

ఇక మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్‭బర్గ్ (Mark Zuckerberg)‭ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్‌మ్యాప్‌ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మేధస్సు అభివృద్ధి గురించి చర్చించారట. “ఇతరులు చేయని కొత్త మార్గాలలో నూతన సామర్థ్యాలను కోట్లాది మందికి అందించడంలో మేము ప్రత్యేకమైన పాత్రను పోషించబోతున్నాము” అని ఉద్యోగులతో జుకర్‌బర్గ్ అన్నారాట.

Return To Office: ఉద్యోగులకు గూగుల్ స్ట్రాంగ్‌ వార్నింగ్, ఇకపై వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే! ఆఫీస్‌కు రాకపోతే కోతలే 

ఇక సంస్థలో ఉద్యోగుల తొలగింపుపై జుకర్‌బర్గ్ స్పందిస్తూ తొలగింపులు, ఇప్పుడు తీసుకుంటున్న మార్పులు తన లక్ష్యం కాదని, కానీ కొన్ని కష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఉద్యోగులతో అన్నారట. ప్రపంచంలో అస్థిరం ఏర్పడిందని, దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ మెటా కార్యకలాపాలను విస్తారించాలని అన్నారట. రానున్న రోజుల్లో తొలగింపులను తగ్గిస్తూ కంపెనీకి పూర్వవైభవం తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు.