Credits: X

Newdelhi, Sep 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై కూడా విజయబావుటా ఎగురవేసింది. సూర్యుడిపై (Sun) అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1(Aditya L1)ను సక్సెస్ అయింది. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ఆదిత్య-ఎల్‌1ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 4 నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కి.మీ. దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో 7 పరిశోధన పరికరాలున్నాయి.

Aditya L1 LIVE: ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం లైవ్ వీడియో ఇదిగో.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే ప్రయోగం లక్ష్యం

ఇదే మొదటి శాటిలైట్

సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే కావడం విశేషం.