Newdelhi, Aug 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి (Moon) చుట్టూ అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి పెట్టారు. ఈ ప్రయోగంలో చివరి డిబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్ మాడ్యూల్ చంద్రుడికి అతిదగ్గరగా ఉన్న 25 బై 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగంలో ఇక మిగిలింది జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియపై దృష్టి సారించారు.
Vikram Lander's final deboosting successful; all eyes on Moon landing scheduled for Aug 23 #Chandrayaan_3 pic.twitter.com/jalUEIv9yu
— Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) August 20, 2023
చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ
‘రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీ బై 134 కీ.మీల కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది’ అని ఇస్రో ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.