Chandrayaan 3 Mission Update (Photo Credits: X/2isro)

Hyderabad, Aug 21: ఇస్రో (ISRO) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు మరి కొద్ది గంటలే మిగిలుంది. విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) ఇప్పుడు చంద్రుని కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు కాకుండా 17 నిమిషాలు ఆలస్యంగా 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. ఈ క్రమంలో ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజ్, డీడీ నేషనల్ సహా ఇతర ఛానెళ్లలో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం ఆగస్టు 23 సాయంత్రం 5.27 గంటల నుంచి ప్రారంభం కానుంది.

ప్రత్యక్ష ప్రసారం లింక్స్ ఇవే

ఇస్రో వెబ్‌సైట్ https://isro.gov.in

ఇస్రో యూట్యూబ్ https://youtube.com/watch?v=DLA_64yz8Ss

ఇస్రో ఫేస్‌బుక్ పేజ్ https://facebook.com/ISRO