Electricity Generated Shoes

Newdelhi, Aug 7: దేశాన్ని రక్షించే జవాన్ల కోసం ఇండోర్‌ లోని ఐఐటీ (IIT-Indore) పరిశోధకులు ప్రత్యేకమైన బూట్లను (Shoes) తయారు చేశారు. ఈ స్పెషల్ ష్యూలు కరెంటును ఉత్పత్తి చేస్తాయి. అంతేకాదు, పర్వతాలలో, అడవుల్లో తిరిగే సాయుధ బలగాలు తామున్న రియల్‌ టైమ్‌ లొకేషన్‌ ను తెలుసుకునేందుకు కూడా వీలు కల్పిస్తాయి. ట్రైబో-ఎలక్ట్రిక్‌ నానోజెనరేటర్‌ (టీఈఎన్‌జీ) టెక్నాలజీతో కూడిన ఈ బూట్లు ప్రతి అడుగుకూ విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని, బూట్లలో అమర్చిన గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) ద్వారారియల్‌ టైమ్‌ లొకేషన్‌ ను కూడా తెలుసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

వీళ్లకు కూడా..

ఈ ప్రత్యేకమైన బూట్లు ఒక్క సైనికులకే కాకుండా అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్న వృద్ధులకు, స్కూల్ విద్యార్థులకు, పర్వతారోహకులకు సైతం ఉపకరిస్తాయని పరిశోధకులు తెలిపారు.

రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ