Newdelhi, July 8: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ (HIV Infection) నుంచి కాపాడే సూది మందు వచ్చేసింది. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials) లో చేపట్టిన ఈ ఇంజెక్షన్ పరీక్షలు సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్ ఇంజెక్షన్ ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది. రోజువారీ మాత్రల రూపంలో రెండు ఇతర ఔషధాల కన్నా లెనకపవిర్ ఇంజెక్షన్ మెరుగైనదా? కాదా? అనే అంశాన్ని ఈ పరీక్షల్లో విశ్లేషించారు. ఈ మూడు ఔషధాలు ప్రీ-ఎక్స్ పోజర్ ప్రొఫిలాక్సిస్ (పీఆర్‌ఈపీ) డ్రగ్స్ అని పరిశోధకులు తెలిపారు.
Injection Twice A Year 100% Effective In HIV Treatment: Study https://t.co/2OWp5oDBa6
— NDTV (@ndtv) July 7, 2024
ట్రయల్స్ ఇలా..
2,134 మంది యువతులు లెనకపవిర్ ఇంజెక్షన్ ను తీసుకోగా, వీరిలో ఎవరికీ హెచ్‌ఐవీ సోకలేదు. నూటికి నూరు శాతం సత్ఫలితాలు వచ్చాయి. ఈ ఇంజెక్షన్ ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు గిలీడ్ సైన్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఉచిత ఇసుక పాలసీ అమలుకు రంగం సిద్ధం, టన్నుకు రూ. 88 వసూలు చేయనున్న ప్రభుత్వం