ISRO's Aditya-L1 completes first halo orbit (Photo Credits: X/@@isro)

New Delhi, July 03: సూర్యుడి అధ్య‌య‌నం కోసం ప్ర‌యోగించిన ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1 Mission) స్పేస్‌క్రాఫ్ట్ (Spacecraft) మొట్ట‌మొద‌టి సారి మండ‌ల క‌క్ష్య‌ను పూర్తి చేసుకున్న‌ది. లాగ్రాంగియ‌న్ పాయింట్ ఎల్‌-1 వ‌ద్ద‌కు గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 23వ తేదీన ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించారు. నిర్దేశిత హాలో ఆర్బిట్‌లోకి ఆ స్పేస్‌క్రాఫ్ట్ 2024, జ‌న‌వ‌రి ఆరో తేదీన చేరుకున్న‌ది. ఎల్‌-1 బిందువు చుట్టూ ప‌రిభ్ర‌మ‌ణ చేసేందుకు ఆదిత్య ఎల్‌-1కు 178 రోజుల స‌మ‌యం ప‌డుతుంది.

 

హాలో ఆర్బిట్‌లో భ్ర‌మిస్తున్న స‌మ‌యంలో.. ఆదిత్య ఎల్‌-1 (Aditya-L1 Spacecraft) స్పేస్‌క్రాఫ్ట్‌పై వివిధ ర‌కాల శ‌క్తుల ప్ర‌భావం ప‌డుతుంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 22, జూన్ 7వ తేదీన రెండు సార్లు ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ మాన్యువోరింగ్ చేసింది. ఎల్‌-1 వ‌ద్ద‌ రెండ‌వ హాలో ఆర్బిట్ మార్గంలో మూడోసారి మాన్యువోరింగ్ మొద‌లైన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది.