Sriharikota, December 11: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన PSLV C48 ప్రయోగం విజయవంతమైంది. గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు. భారతదేశానికి చెందిన అధునాతన గూఢచారి ఉపగ్రహమైన రిసాట్ -2 బిఆర్1 (RISAT-2BR1 ) ఉపగ్రహంతో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సీ48 (PSLV C48) రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
628 కిలోల బరువున్న RISAT-2BR1 ను రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం భూఉపరితలం నుంచి 576 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలో ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల జీవితకాలాన్ని కలిగి ఉంది.
వ్యవసాయం, అటవీ మరియు విపత్తు రంగాల నిర్వహణ కొరకు భారత్ ఈ ఉపగ్రహ సేవలను ఐదేళ్ల పాటు వినియోగించుకోనుంది.
Here's the Video:
#WATCH ISRO launches RISAT-2BR1 and 9 customer satellites by PSLV-C48 from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota; RISAT-2BR1 is a radar imaging earth observation satellite weighing about 628 kg. pic.twitter.com/mPF2cN9Tom
— ANI (@ANI) December 11, 2019
రిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు వాటి వాటి నిర్ధేశిత కక్ష్యలలో ఇస్రో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇందులో అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్‌కు చెందిన 3 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన సెర్చ్ మరియు రెస్క్యూ సంబంధ రక్షణ పరమైన ఒక ఉపగ్రహం మరియు జపాన్‌కు చెందిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ కొరకు ఒక ఉపగ్రహం ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా భారత్ ప్రయోగించిన మొత్తం విదేశీ ఉపగ్రహాల సంఖ్య 319కి చేరింది.