Newdelhi, July 16: చంద్రుడి (Moon) ఉపరితలంపై ఒక భారీ గుహను (Cave on Moon) ఇటలీ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములు దీంట్లో ఆశ్రయం పొందవచ్చని తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969లో ప్రయోగించిన ‘అపోలో-11’.. చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని వెల్లడించారు. చంద్రుడిపై ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’ అనే ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గొయ్యి మాదిరి ఓ గుహ ఉందని, భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చునని విశ్వసిస్తున్నారు.
ఎలా ఏర్పడ్డాయి అంటే?
ఉపరితలానికి కొంత లోతులో లావా ప్రవహించే లావా ట్యూబ్స్ కారణంగానే ఈ గొయ్యి ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రునిపై 200కుపైగా గొయ్యి మాదిరి ఉండే గుహలు ఏర్పడినట్టు తెలిపారు.
తొలి ఏకాదశి ఎప్పుడు..? ఉపవాసం, పూజ విధానం ఏమిటి...ఈ రోజు చేయాల్సిన పూజలు ఇవే..