Hyderabad, Aug 22: యావత్తు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతమయ్యేందుకు ఇస్రో (ISRO) పక్కా ప్రణాళిక వేసింది. రాబోయే సమస్యలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రయాన్-3 ప్రయోగాన్ని డిజైన్ చేసింది. ఇక రష్యా (Russia) ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ (Lander) చంద్రుడిపై చివరినిమిషంలో కూలిపోయిన తరుణంలో ఇస్రో శాస్త్రవేత్త ఒకరు కీలక ప్రకటన చేశారు. ల్యాండర్ మాడ్యూల్ కు సంబంధించి ప్రతికూలతలు తలెత్తితే ల్యాండింగ్ తేదీని మారుస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 27న విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ దిగేందుకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే.
Chandrayaan 3 Updates: 'Moon landing will be postponed to August 27 if factors are unfavourable'. pic.twitter.com/21WLkzQVnU
— Marketing Motivation (@marketing_motiv) August 21, 2023
వైఫల్యంతో నేర్చుకున్న అనుభవాలతో..
చంద్రయాన్-2 వైఫల్యంతో నేర్చుకున్న అనుభవాలను మిళితం చేస్తూ చంద్రయాన్-3ని ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం చంద్రుడిపై దిగేందుకు అనువైన పరిస్థితుల కోసం విక్రమ్ ల్యాండర్ వేచిచూస్తోంది.