Rare Green Comet: వారంపాటూ ఖగోళంలో అద్భుతం, 50వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క, విజయవాడ వాసులకు దగ్గరగా చూసే అదృష్టం
Super Earth (Image Credits: IndiaToday)

New Delhi, FEB 01: ఇవాళ ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన అరుదైన ఆకుపచ్చ తోక చుక్క Rare Green Comet () తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్‌ కొమెట్‌గా పిలువబడే ఈ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా (Closest Approach To Earth) రానుంది. C/2022 E3 (ZTF)పేరుతో ఉన్న తోకచుక్క దక్షిణ అర్ధగోళంలో ఆకాశం నిర్మలంగా ఉంటే ఆయా ప్రాంతాల వారికి కనిపిస్తుంది. మంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ (Vijayawada) నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

OLX Layoffs: ఉద్యోగులను సాగనంపుతున్న మరో కంపెనీ, 1,500 మందికి పైగా ఉద్యోగులకు తీసేస్తున్న OLX, ఆర్థిక మాంద్య భయాలే కారణం.. 

NASA ప్రకారం , నియాండర్తల్ కాలంలో కామెట్ (Closest Approach To Earth) భూమిని సందర్శించింది. ఇది ఫిబ్రవరి1 ఆకుపచ్చ తోక చుక్క భూమికి 26 మిలియన్ మైళ్ల (42 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోకి వస్తుంది. మళ్లీ వేగంగా వెళ్లిపోతుంది. మిలియన్ల సంవత్సరాల వరకు తిరిగి వచ్చే అవకాశం లేదు. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్ ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు గత ఏడాది మార్చిలో ఈ తోకచుక్కను తొలిసారిగా గుర్తించారు. ఇది ఆ సమయంలో బృహస్పతి కక్ష్యలో ఉంది. అప్పటి నుండి ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది. సాధారణంగా తోకచుక్కలను అంచనా వేయలేమని.. అయితే ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మాత్రం ఈ తోకచుక్క చాలా ప్రకాశవంతంగా దర్శనమివ్వనుందని నాసా తెలిపింది.