Newdelhi, July 23: పగటిపూట ముఖ్యంగా మధ్యాహ్నం వేళ భోజనం అయ్యాక ఓ కునుకు (Day Sleep) తీయటం చాలామందికి అలవాటుగా ఉంటుంది. ఇలా పగటిపూట నిద్రపోవటం.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ’ పరిశోధకులు తెలిపారు. పగటి నిద్రతో ‘డిమెన్షియా’ (మతిమరుపు) (Dementia) బారినపడే అవకాశం ఉండబోదని, ఈ చర్య జ్ఞాపకశక్తిని ‘రీరైట్’ చేస్తుందని పేర్కొంటున్నారు. మెదడు చురుగ్గా ఉండాలంటే దానికి కొంత విశ్రాంతి అవసరమని, అది నిద్ర ద్వారా లభిస్తుందని చెప్పారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతి నెలా రూ.25 వేల పింఛన్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Could day-time nap keep dementia away?
Apparently, yes - according to an AI experthttps://t.co/Isd2BTHYOx
— WION (@WIONews) July 23, 2024
ఇలా అయితే, కష్టం
మెదడుకు సరైన పని చెప్పకుండా.. ప్రతీ విషయానికీ టెక్, ఏఐపై ఎక్కువగా ఆధారపడటం నష్టమేనని, దీంతో డిమెన్షియా బారనపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ భౌతిక, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు.