Mumbai, AUG 31: . సెప్టెంబర్ 1 నుంచి రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ (Reward Points) సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC bank) కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.
సెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC Bank) కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ.. స్టేట్‌మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది.